గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో APలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.