మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. దుస్తులు మార్చుకునే గదికి వెళ్లగా సీలింగ్‌లో మొబైల్ ఫోన్ కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే తన భర్తకు ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో మహిళకు సంబంధించిన వీడియోలు కూడా ఆ ఫోన్లో రికార్డు చేసినట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.