టీనేజ్లో వాళ్ల నాన్న చేసిన పనికి మల్లి(అల్లరి నరేష్) మూర్ఖంగా మారడంతో అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది మూవీ కథ. హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం, ఆమెతో ప్రేమలో పడ్డాక మల్లి తీసుకున్న నిర్ణయాలు ఏంటి?, ఆమెతో ప్రేమకథ సుఖంతమైందా?, తండ్రితో సమస్యలు ఏంటి? అనేది చూపించారు. నరేష్ నటన, కథా నేపథ్యం, కొన్ని మలుపులు మూవీకి ప్లస్. రక్తి కట్టించని కథనం, బలం లేని భావోద్వేగాలు, కొన్ని బోరింగ్ సీన్స్ మైనస్. రేటింగ్: 2.5/5.