అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇవాళ కూతురు ఆరాధ్య చదువుతోన్న ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఈ జంట తమ కుమార్తె ఆరాధ్యకు మద్దతుగా వచ్చారు. వారి వివాహబంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. విడిపోయారని గత కొంతకాలంగా వస్తోన్న పుకార్ల మధ్య తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈవెంట్‌కు వారిరువురు కలిసి రావడంతో అలాంటి వార్తలకు స్వస్తి పలికారు.