సత్యసాయి: గోరంట్ల మండల గుంతపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పుట్టపర్తి మండలం పెడబల్లి తండాకు చెందిన మహేశ్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి అదే తండాకు చెందిన రాజేశ్ నాయక్ అని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.