AP: అనంతపురం యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని ఓ సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమలోని ఇటుకలు కాలిపోయాయి. కార్మికులపై ఈ కాలిన ఇటుకలు పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.