NGKL: కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. జూబ్లిహిల్స్‌లో భరణి లేఅవుట్లో ఆయన ఇంట్లో ఏకంగా రూ.7.5 లక్షల ఎత్తుకెళ్లారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులకు జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన సమయంలో జైపాల్ యాదవ్ ఇంట్లో లేరని తెలుస్తోంది.