ATP: బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐచర్ వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి రమేశ్ బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మడకశిర మండలం ఈ.రామగిరికి చెందిన రమేశ్ బాబు ఐచర్ వాహనంలో పత్తికొండకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి సొంతూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో జారి కింద పడి మృతి చెందాడు.