MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ హైస్కూల్లో ఈనెల 20న సీఎం కప్ జిల్లాస్థాయి జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు డివైఎస్ఓ రాజ్ వీర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కనప రమేష్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సీఎం కప్ పోటీలకు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఫామ్‌తో పాటు ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.