KMM: బైకు, ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వెంకటాపురం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండల శివారులో బైకును ఆటో ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు చెప్పారు. వెంటనే గాయపడిన వారిని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.