NLR: కొవూరు మండలం పడుగుపాడు ఇనమడుగు రైల్వే గేటు వద్ద ఆదివారం అస్సాంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. సిల్చారు నుంచి తిరుచూరు వెళ్లే అరుణయ్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఆయన పొరపాటున కింద పడ్డాడు. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం రెండు భాగాలుగా వేరుపడింది. మృతుడిని అస్సాం రాష్ట్రం గోవిందపూర్ ప్రాంతానికి చెందిన షాలే అహ్మద్ (32)గా గుర్తించారు.