సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉపాసన కొణిదెల Xలో పోస్ట్ పెట్టారు. ‘అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య నేర్పించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం దగ్గర అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించాం. తిరుమల, శ్రీశైలం వంటి పలు క్షేత్రాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేశాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.