KMM: సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు సోమవారం నుంచి శనివారం వరకు నిర్వహించేందుకు యువజన క్రీడలశాఖ సిద్ధమైంది. ఈనెల 16 నుండి 21 వరకు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిల్లో ఎంపిక చేసిన క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు సర్దార్ పటేల్ స్టేడియంలో ఉండాలని డీవైఎస్ఓ సునీల్ కోరారు.