భారత మహిళల హాకీ జూనియర్ జట్టు అదరగొడుతోంది. మస్కట్‌లో జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. దీంతో సెమీ ఫైనల్లో జపాన్ను చిత్తు ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత అమ్మాయిలు 1-3 తేడాతో జపాన్‌పై గెలుపొందారు. ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో చైనా లేదా సౌత్ కొరియాతో భారత్ తలపడనుంది.