E.G: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కం యూనివర్సిటీ సెలక్షన్స్ పోటీలు శనివారంతో ముగిసాయి. అథ్లెటిక్స్‌లో భాగంగా రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ కైవసం చేసుకుంది.