బ్రిస్బేన్లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం గురించి ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియానే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. భారత్కు అవకాశాలు ఉన్నా తక్కువేనని అంచనా వేశాడు. కాగా గత 40 ఏళ్లలో గబ్బాలో ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే ఓడిందని పాంటింగ్ గుర్తుచేశాడు.