»Three People Dead In Vijayawada Thermal Power Station Due To Lift Wire Breaking
Breaking: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి
ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో లిఫ్టులో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లిఫ్ట్ వైరు ఆకస్మాత్తుగా తెగి కిందపడటంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే వీటీపీఎస్ లో కొత్తగా ఐదో ఫ్లోర్ నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు పలువురు సిబ్బంది వెళ్లారు. తొలుత లిఫ్టు పనిచేయడం లేదని తిరిగి వచ్చారు. తర్వాత ఇంకొంత మంది ఎక్కిన తర్వాత లిఫ్ట్ పైకి వెళ్లింది. ఆ క్రమంలో లిఫ్ట్ వేరు తెగిపడి లిఫ్ట్ ఆకస్మాత్తుగా కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా..మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.