ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌పై రష్యా ఫెడరేషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఫైనల్లో భారత ప్లేయర్ గుకేశ్‌పై చైనా ఆటగాడు లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయారని వ్యాఖ్యానించింది. ఉత్కంఠగా సాగుతున్న పోరులో లిరెన్ చేసిన తప్పిదం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపింది. లిరెన్ ఉన్న స్థితిలో ఓడిపోయే అవకాశమే లేదని.. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ప్రత్యేకంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది.