»Manish Sisodias Bungalow Allotted To Delhis New Minister Atishi
Manish Sisodia’s Bungalow నూతన మంత్రి అతిషికి కేటాయింపు
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది.
Manish Sisodia's Bungalow Allotted To Delhi's New Minister Atishi
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది. తనకు బంగ్లా కేటాయింపుపై ఆమోదం తెలిపిందుకు వారం రోజుల సమయం కావాలని అతిషి కోరారు.
మథుర రోడ్లో గల ఏబీ-17 బంగ్లాలో సిసోడియా (Manish Sisodia) ఉండేవారు. అంతకుముందు మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇక్కడే స్టే చేసేవారు. తర్వాత ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. 2015 నుంచి సిసోడియా (Manish Sisodia) ఈ బంగ్లాలో ఉంటున్నారు. ఇదీ రొటిన్ ప్రక్రియ అని.. సిసోడియా (Manish Sisodia) మంత్రి పదవీకి రాజీనామా చేయడంతో అతిషికి ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మార్చి 21వ తేదీ లోపు బంగ్లాను ఖాళీ చేయాలని సిసోడియాకు (Manish Sisodia) అధికారులు స్పష్టంచేశారు. లేఖ ప్రకారం సడలింపులు కేవలం 15 రోజుల వరకే ఉంటాయని పేర్కొంది. సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ ఢిల్లీ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అవినీతి, మనీ ల్యాండరింగ్ కేసులో వీరిద్దరూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వీరి స్థానంలో అతిషి (Atishi), సౌరభ్ భరద్వాజ్‌కు మంత్రి పదవులు వరించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిసోడియా (Manish Sisodia) ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ అయ్యారు. నూతన మద్యం విధానంతో (new excise policy) అవినీతికి తెరతీశారని సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సిసోడియా కస్టడీని ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.