బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పతనంతిట్ట, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.