E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల ఆర్చరీ పోటీలను ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ స్పోర్ట్స్ బోర్డ్ ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ జి.సుధాకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్చరీ క్రీడపై క్రీడాకారులు మక్కువ చూపిస్తున్నారని అన్నారు.