కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో బీచ్ వాలీబాల్ జరగనున్నాయి. ఈ పోటీల నిమిత్తం గురువారం అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పీఈటీ, డీఈఓ, స్పోర్ట్స్ అధికారులు, వాలీబాల్ పోటీల నిర్వహణ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.