విరాట్ కోహ్లీపై భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని ఆడటంలో కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి బలహీనత గురించి మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఒకట్రెండు మ్యాచ్లు ఆడిన బౌలర్లకూ కోహ్లీ ఎలా ఔటవుతాడో తెలుసని పేర్కొన్నాడు.