ధోనీపై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసలు కురిపించాడు. అతడితో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని తెలిపాడు. ధోనీ లాంటి నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని కొనియాడాడు. అతని ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. మతిశా పతిరన లాంటి యువ బౌలర్‌ను డేంజరస్ మ్యాచ్ విన్నర్‌గా తీర్చిదిద్దాడని.. తన ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.