భారత క్రికెట్లో ప్రపంచకప్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. ఇవాళ ఆయన 43వ పుట్టినరోజు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి బ్యాటుతో పాటు బంతితోనూ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి విజయాన్ని అందించాడు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువీదే కీలక పాత్ర. ఇక 2007లో ENGపై కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సర్లను క్రికెట్ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోరు.