BDK: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంతో పోలిస్తే వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని, ఇందుకు జాతీయ స్థాయి NQAS సర్టిఫికేషన్ రావడమే ఉదాహరణ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఆసుపత్రిలో సేవలు మెరుగుపడటానికి కృషి చేసిన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.