TG: రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఆదిలాబాద్లో కనిష్ఠంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 15 డిగ్రీలు, హనుమకొండలో 15.5 డిగ్రీలు, హైదారాబాద్లో 16, నిజామాబాద్లో 16.2 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.