NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ తల్లిదండ్రులకు పలు సూచనలు చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఉ.10 గం.లకు చేరుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.