కామారెడ్డి: ఈనెల 22వ తేదీ వరకు వ్యవసాయ గణన సర్వే పూర్తి చేయాలని శిక్షకుడు శేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం వ్యవసాయ గణనపై గణాంకాల శిక్షణ ఇచ్చారు. రెండో విడత శిక్షణకు సంబంధించి గణకులుగా జిల్లాకు చెందిన ఏఈఓ లను నియమించారు. రెండో విడతలో 118 రెవెన్యూ గ్రామాలు, మూడవ విడతలో 46 గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు చెప్పారు.