అన్నమయ్య: ఆటో బోల్తా పడి నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. కురబలకోటకు చెందిన ఫాతిమా(65), మహమ్మద్(40), మహమ్మద్ భాష(43), 9 నెలల గర్భిణీ గౌసియా(30) బుధవారం సాయంత్రం కురబలకోట నుంచి అంగళ్లకు ఆటోలో బయలుదేరారు. మార్గ మద్యంలోని కురబలకోట మలుపు వద్దకు రాగానే ఆటోకు ముందర ఉన్న టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి బోల్తా పడింది.