TPT: ఎస్వీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న10మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జోన్ పరిధిలో ముగ్గురు, చిత్తూరు జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏడుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు ప్రకటించారు.