పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా కెప్టెన్సీతో పోల్చుతూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నాడు. తొలి టెస్టు విజయానికి, రెండో టెస్టు ఓటమికి మధ్య తేడా బౌలింగ్ విభాగమేనని తెలిపాడు.