అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతని మార్కెట్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ల కంటే 2024 ప్రథమార్ధంలో అత్యధిక బ్రాండ్లకు ఎండోర్స్మెంట్ చేస్తున్న వ్యక్తిగా ధోనీ నిలిచాడు. ఈ మేరకు ‘TAM మీడియా రిసెర్చ్’ నివేదిక విడుదల చేసింది. ధోనీ 42 బ్రాండ్లతో మొదటి స్థానంలో ఉండగా.. అమితాబ్ (41) తర్వాతి స్థానంలో ఉన్నట్లు తెలిపింది.