బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 371 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ తడబడుతూ 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో 122 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై 3 వన్డేల సిరీస్ 2-0తో కోల్పోయింది. భారత్ బ్యాటర్లలో రిచా ఘోష్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4 వికెట్లతో సత్తాచాటింది.