TG: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బొమ్మ నెట్టింట వైరల్ అవుతోంది. యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపడానికి కోహ్లీ బొమ్మను సిద్ధం చేశారు. అక్కడ కోహ్లీ బొమ్మను కుర్చీలో కుర్చున్నట్లు తీర్చిదిద్దారు. అయితే జిల్లాస్థాయిలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నప్పుడు ఆ బొమ్మను అక్కడ పెడతారట. అవసరం లేనప్పుడు లోపల ఉంచి భద్రపరచనున్నారు.