మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా – భారత్ మహిళల జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోరు సాధించింది. జార్జియా వోల్స్ (101), ఎలీసా పెర్రీ (105) సెంచరీలు బాదారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌నూ కోల్పోతే మాత్రం సిరీస్ చేజారినట్లే.