పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 128 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో జైస్వాల్(24), రాహుల్(7), గిల్(28), కోహ్లీ(11), రోహిత్(6) పరుగులకే పెవిలియన్ చేరారు. బోలాండ్ 2, కమిన్స్ 2, స్టార్క్ 1 తలో వికెట్ తీసుకున్నారు. క్రీజ్‌లో పంత్(28), నితీష్(15) ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 29 పరుగుల లీడ్‌లో ఉంది.