PPM: పార్వతీపురం పట్టణానికి చెందిన దువ్వెల యోగేశ్వరి అనంతపురం జిల్లాలో నవంబర్ 23, 24 తేదీలలో జరిగిన అంతర జిల్లాల 68 వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలలో పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈసందర్బంగా పంజాబ్లో జరగబోయే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికైన సందర్భంగా యేగేశ్వరిని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అభినందించి, ఆర్థిక సహకారం అందజేశారు.