VZM: దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందగా, మరో ఆరు పశువులు అక్కడికక్కడే చనిపోయాయి. వంగర గ్రామానికి చెందిన మహేష్ గొర్రెల మందను పెదమానాపురం సంతకు తీసుకు వస్తుండగా పార్వతీపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహేష్, మరో ఆరు గొర్రెలు మృతి చెందినట్లు ఎస్సై జయంతి తెలిపారు.