భారత్ అండర్-19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో భారత్ అండర్-19 జట్టు తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.