మెక్రో బ్లాగింగ్ సైట్ Twitterలో మార్పులు కూ(koo), మెటా(meta) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు అవకాశంగా మారుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో వినియోగదారులు తగ్గుతున్నారని తెలిపారు. ఇదే నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియా యాప్ కూ ఇటీవల ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రేవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది కూడా ఓ కారణమేనని అంటున్నారు. ట్విట్టర్లో ఎలాన్ మాస్క్(elon musk) మార్పుల కారణంగా యూజర్లు మారుతున్నట్లు పేర్కొన్నారు.
టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్(elon musk) ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగుల తగ్గింపు సహా అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ట్విట్టర్ అల్గారిథమ్‌ను మారుస్తానని ప్రకటించాడు. అయితే మాస్క్ ఇదంతా చేస్తున్నది వాస్తవానికి మొత్తం ఖర్చు తగ్గించడంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకరి చర్యల వల్ల వారికి నష్టం జరుగగా..అది మరొకరికి లాభం జరుగుతుందని పలువురు చెబుతుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. Twitter మార్పులు సహా పలు కారణాలతో యూజర్లు ఇతర ప్లాట్ ఫాంలకు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు పోటీగా ఉన్న కూ(koo), మెటా(meta), స్నాప్ చాట్(snapchat) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు ఇది అవకాశంగా మారుతోందని టెక్ నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలో ట్విటర్(Twitter)కు మరింత పోటీని ఇచ్చేందుకు సోషల్ మీడియా యాప్ కూ(KOO) ఇటీవల ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ(ChatGPT)ని ప్రేవేశపెడుతున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు పోస్ట్‌లను మరింత సులభం చేయడంలో ఇది సహాయపడుతుందని Koo సహ వ్యవస్థాపకుడు మయాంక్(Mayank bidawatka) పేర్కొన్నారు. ప్రస్తుత సంఘటనలు, రాజకీయాలు లేదా ఇతర సంస్కృతికి సంబంధించిన పోస్ట్‌లను చేయడంలో సహాయపడేందుకు Koo వినియోగదారులు నేరుగా యాప్‌లోనే ChatGPTని ఉపయోగించగలరని వెల్లడించారు. దాదాపు 20% Koo వినియోగదారులు యాప్‌లో కంటెంట్‌ను యాక్టివ్‌గా క్రియేట్ చేస్తారు. ChatGPT వాడకం ద్వారా ఆ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఈ ఫీచర్ ముందుగా Kooలో ధృవీకరించబడిన ఖాతాలకు అందుబాటులోకి వస్తుందని తర్వాత అందరూ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ChatGPT అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) బాట్. ఇది ప్రశ్నలకు ప్రతిస్పందనగా సమాచారాన్ని అందించగలదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చాట్ జీపీటీ(ChatGPT) వాడకం ఇటీవల ఎక్కువగా పెరిగింది.
మరోవైపు మెటా(meata) ప్లాట్‌ఫారమ్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో Facebook మాతృ సంస్థ Meta ట్విట్టర్‌కు పోటీగా ఓ టెక్స్ట్-ఆధారిత యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఫేస్బుక్ వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ట్విట్టర్లో మార్పుల కారణంగా వినియోగదారులు ప్రత్యమ్నాయం కోసం చూస్తున్న క్రమంలో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
మరోవైపు గత నెలలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ Google ప్రతి ఒక్కటి తమ సొంత ఉత్పాదక AI చాట్బాట్లను ప్రకటించాయి. ఇవి శోధనలకు ప్రతిస్పందనగా వెబ్‌లో సమాచారాన్ని అందిచగలవు. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ సైతం Snap Inc (SNAP.N) చాట్‌బాట్‌ను పరిచయం చేసింది.