అంచనాలకు తగ్గట్లుగానే పుష్ప-2 సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రీ సేల్లోనే పలు రికార్డులు సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.175కోట్ల వసూళ్లు రాబట్టింది. కాగా, అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 తెరకెక్కిన విషయం తెలిసిందే.