అక్కినేని నాగచైతన్య-శోభితల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను ‘X’ వేదికగా పంచుకున్న నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ‘నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది. మా ప్రియమైన కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీర్వాదాలు మరువలేనివిగా చేశాయి. ఈ పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు. మీరందరూ మాతో పంచుకున్న ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మాపై కురిపించిన ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేశాడు.