సిద్దార్థ రాయ్ చిత్రంతో హీరోగా పరిచయమైన దీపక్ సరోజ్ మరో రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యదు వంశీ, క ఫేమ్ సుజిత్-సందీప్ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించారు. హీరోయిన్లుగా దీక్షిక, అనైరా నటిస్తుండగా.. రఘుబాబు, సత్య, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.