అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ చెత్తను వెయ్యకుండా చెత్త బండికి ఇవ్వాలని వార్డు ప్రజలకు సూచించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.