సోషల్ మీడియాలో తమ నేతలపై అసభ్య, అభ్యంతకర పోస్టులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించడంలేదు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్రస్థాయి నేతలు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు మరో 16 మందికి కూడా నోటీసులు ఇచ్చారు.