AP: గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాల విషయంలో అవకతవకలు జరిగాయన్న విమర్శలపై మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. విద్యుత్ చరిత్రలో చారిత్రక ఒప్పందం జగన్ హయాంలో జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేశామన్నారు. సెకీ నుండి లేఖ వచ్చినప్పుడు సంతకం పెట్టి నేడు ఏమీ తెలియదని బాలినేని శ్రీనివాసరావు మాట్లాడటం తన వ్యక్తిత్వాన్ని తాను దిగజార్చుకోవడమేనని విమర్శించారు.