కృష్ణా: ముదినేపల్లి మండలం వడాలిలోని శాలీల బజార్లో రూ.3.75 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు పాల్గొని భూమి పూజ చేశారు. 15 ఏళ్ల డ్రైనేజీ సమస్య పరిష్కరించినందుకు వారిని శాలువా, పూలమాలలతో కాలనీవాసులు సత్కరించారు.