ELR: అపార్ ఐడెంటిటీ కార్డుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పాఠశాలల వారీగా హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్లు, భీమడోలు విద్యాధికారి భాస్కర్ కుమార్ ఆదివారం భీమడోలు తెలిపారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సహకారంతో మండలంలో ఇంతవరకు 87% అపార్ కార్డులను నమోదు కార్యక్రమం పూర్తయిందన్నారు. ఇంకను సుమారు 1800 విద్యార్థుల వివరాలు నమోదు చేయవలసి ఉందన్నారు.