NGKL: వెల్దండ మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడి పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందించేందుకు సరైన సమయానికి నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడి సూపర్వైజర్కు ఆదేశించారు.